
ముంబైలో GSB సేవా మండల్ ఏర్పాటు చేసిన అత్యంత సంపన్నమైన గణేష్ విగ్రహం విశేషంగా నిలుస్తోంది. ఈ ఏడాది గణపతి నవర్రాతి వేడుకలకు సంబంధించి తన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. దీంతో ముంబైలో పండుగ ఉత్సాహం మిన్నంటింది. ఈ అద్భుతమైన విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇది నిజంగా "విరాట్ దర్శనం" అని అభివర్ణించారు భక్తులు. అంతేకాదు ఈ ఏడాది గణపతి విగ్రహం భారతదేశంలోనే అత్యంత ధనిక గణపతి విగ్రహంగా రికార్డు క్రియేట్ చేసింది.
గణేష్ చతుర్థి 2025 వేడుకలు
GSB సేవా మండల్ గణపతి వేడుకలు ఆగస్టు 27న సియోన్‌లోని కింగ్స్ సర్కిల్‌లో ప్రారంభమై ఐదు రోజుల పాటు కొనసాగుతాయి. పలు నివేదికల ప్రకారం, ఈ సంవత్సరం విగ్రహం 69 కిలోల బంగారు ఆభరణాలు, 336 కిలోల వెండితో అలంకరించారు. ఇది ముంబైలో అత్యంత సంపన్నమైన గణపతిగా నిలిచింది. అంతేకాదు దీనికి గట్టి భద్రతా ఏర్పాట్లను కూడా చేయడం విశేషం.

అలాగే GSB సేవా మండల్ తన 71వ గణేష్ ఉత్సవాలకు రికార్డు స్థాయిలో రూ. 474.46 కోట్ల భీమా కవరేజీని కూడా పొందింది. ఇదీ ఓ రికార్డే. ఇందుల దాదాపు రూ. 375 కోట్లు పూజారులు, స్వచ్ఛంద సేవకులు, వంటవారు, భద్రతా సిబ్బంది , పండల్ చుట్టూ ఉన్న చిన్న సేవా స్టాళ్లలో పనిచేసేవారికి వ్యక్తిగత ప్రమాద బీమాకు కేటాయించబడింది. ఈ పాలసీలో అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, ప్రత్యేక ప్రమాదాలు , డిజిటల్ ఆస్తుల నుండి రక్షణ కూడా ఉంది. అదనంగా రూ. 30 కోట్లు ప్రజా బాధ్యతను కవర్ చేస్తాయి, భక్తులకు భద్రతా ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి: Vinayaka Chavithi 2025: గణపతికి ఎంతో ప్రీతి పాత్రమైన తీపి వంటకాలు
గణపడి ఆభరణాల కోసమే రూ. 67.03 కోట్ల బీమా ఉంది. గత ఏడాది గణేష్ మంటపానికి అందించిన మొత్తం భీమా రూ. 400.58 కోట్లుగా ఉంది, ప్రస్తుతం ఆ రికార్డును ఆ బెంచ్‌మార్క్‌ను అధిగమించింది. భక్తుల కోసం భద్రత నిమిత్తం మూడు షిఫ్టులలో 875 మంది సిబ్బంది, 100 కి పైగా CCTV కెమెరాలు, AI-ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థలు మరియు మెటల్ డిటెక్టర్ గేట్లను మోహరించింది. 1954లో స్థాపించబడిన GSB సేవా మండల్ ముంబైలోని గణేష్ చతుర్థి వేడుకలనుఘనంగా నిర్వహిస్తుంది. ప్రతీ ఏడాది దేశవ్యాప్తంగా భారీ విరాళాలు అందుతాయి.
చదవండి: Vithika sheru బొజ్జ గణపయ్య మేకింగ్ వీడియో వైరల్