
వినాయకచవితి వేడుకల కోసం దేవ్యాప్తంగా భక్తజనం సన్నాహాల్లో ఉన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణేషులనే పూజించాలని ఇటు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మట్టి గణపతే మహా గణపతి అనే నినాదంతో గ్రీన్ గణేషుడికి జై కొడుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య, హీరో వితికా షేరు కూడా ఈ నినాదాన్నే ముందుకు తీసుకెడుతూ మట్టితో బొజ్జగణపయ్య విగ్రహాన్ని అందొగా రూపొందించింది. దీనికి సంబంధించిన వీడియోన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మా వినాయకుడు రెడీ జై బోలో గణేష్ మహారాజ్ కి మా గణపతి ఎలా అనిపించారో చెప్పండి అని తెలిపింది. దీంతో అటు అభిమానులు, ఇటు పర్యావరణ ప్రేమికులు వితికా ప్రయత్నాన్ని, ప్రచారాన్ని ప్రశంసిస్తున్నారు.
చదవండి: పొలాల్లో ప్లాస్టిక్ భూతం! బయోపాస్టిక్‌లూ విషపూరితమే!
వినాయక చవితి సందర్భంగా మట్టి గణేషుని తయారు చేసే విషయంలో వితిక తన ట్యాలెంట్‌తో నెటిజన్లను మెస్మరైజ్ చేసారు. మట్టితో వినాయకుడిని తయారు చేసి, అందంగా బుజ్జి గణేషున్ని తయారు చేసి. సహజ సిద్ధమైన రంగులతో మరింత అందంగా రూపొందించింది. ఈ తయారీ విధానాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందించింది. ప్రస్తుతంఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: Yoga మైగ్రేన్‌తో భరించలేని బాధా? బెస్ట్ యోగాసనాలు
మట్టి గణపతినే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం!