breaking news
Sankatahara Chaturthi
-
సకల సంకటాలను తొలగించే సంకట చతుర్థి
డిసెంబర్ 7, ఆదివారం సంకష్టహర చతుర్థి. ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. సాధారణంగా క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహర చతుర్థి ఎప్పుడనేదీ ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు. ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి.ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచోట గణపతిని ఉంచి ప్రదక్షిణ చేయవచ్చు. సూర్యాస్తమయం (Sunrise) అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. సూర్యాస్తమయం వరకు పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మామూలుగా భోజనం చేయాలి.ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం (Fasting) చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం నాలుగుసార్లు పఠించి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించవచ్చు. ఉపవాసం చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకట నాశన గణేశ స్తోత్రం పఠించినా ఫలితం ఉంటుంది.చదవండి: దత్తజయంతి నాడు ఏమి చేయాలి? -
ఆచరించిన వారికి అండాదండా.. సంకటహర చతుర్థీ వ్రతం!
వినాయకుని అనుగ్రహం పొందేందుకు మనం ప్రతియేటా భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక చవితి పర్వదినం జరుపు కుంటాం. అయితే తలపెట్టిన ఏ పనీ ముందుకు సాగక, జీవితంలో అన్నింటా విఘ్నాలు ఎదురవుతూ, అశాంతి, శారీరక, మానసిక రుగ్మతలు, రుణబాధలు వంటి కష్టాలు కలుగుతూ ఉన్నప్పుడు, దుష్టగ్రహాల పీడతో నానా బాధలు అనుభవించే వారు ప్రతి మాసంలోనూ సంకటహర చతుర్థినాడు యథాశక్తి విఘ్నేశునికి పూజలు జరిపితే ఈ కష్టాలన్నీ తొలగి సుఖ సంతోషాలతో పాటు కార్యజయం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.వేదకాలం నుంచి ఆధునిక కాలం వరకు గణపతి ఆరాధన విస్తృతంగా జరగటం తెలిసిందే. వినాయక శబ్దానికి విశిష్టమైన వాడని, నాయకులు లేనివాడని అర్థం. గణపతి గురించి గణేశ పురాణం, స్కాంద పురాణం, ముద్గల పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, శివ పురాణంలో కనిపిస్తుంది. ఋగ్వేదంలో సైతం గణపతి ప్రస్తావన ఉంది. గణపతిని జ్ఞానానికి అధిదేవత అని ఋగ్వేదం కొనియాడింది. గణాల అధిపతిగా గణపతి పేరు సార్థకమయ్యింది. మానవులందరికీ మంచి చేసేవారిని గణపతి అని అంటారు. మానవునిలోని చెడును హరించే వాడికి గణపతి అని, వినాయకుడని పేరు. వినాయకునికి రోగహర శక్తి ఉందని గణేశ పురాణం చెబుతోంది.గణపతితో సమానమైన పేరుగల బ్రాహ్మణస్పతిలేదా బృహస్పతి గురించి ఋగ్వేదంలో ప్రస్తావన కనిపిస్తుంది. తనను ఆరాధించేవారిని గణపతి ఎల్లవేళలా కాపాడుతుంటాడని ఋగ్వేదం వివరించింది. బ్రహ్మచర్యం అవలంబించి, వేద వేదాంగ శాస్త్రాలను అధ్యయనం చెయ్యవలసిన విద్యార్థులకు గణేశుడు ఆశ్రయ దాత, పోషకుడు.సంకట విమోచక గణపతి స్తోత్రం..నారద ఉవాచప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకంభక్తావాస స్మరేన్నిత్యం ఆయుఃకామార్థ సిద్ధయేప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకంతృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకంలంబోదరం పంచమం చ షష్టం వికటమేవచసప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకంఏకాదశం గణపతిం ద్వాదశాంతు గజాననంద్వాదశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాన్నిత్యంనచ విఘ్నభయం తస్యసర్వసిద్ధికరం ప్రభోఃవిద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభేత్ పుత్రం మోక్షార్థీ లభేత్ గతింజపేద్గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయఃఅష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చః లిఖిత్వాయత్సమర్పయేత్తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతఃసంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది?ప్రతిమాసంలోనూ వచ్చే బహుళ చతుర్థి (బహుళ చవితి)ని సంకటహర చతుర్థి లేదా సంకట విమోచక చతుర్థిగా పిలుస్తారు. జాతకంలో కేతు మహర్దశ నడుస్తున్నవారు, కష్టాలను అనుభవించేవారు, తరచు కార్యహానితో చికాకులకు లోనవుతున్నవారు ఈ వ్రతం చేయడం మంచిది. ఆ రోజున పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుడికెళ్లి గరికపై ప్రమిదనుంచి దీపారాధన చేసి, గరికపోచలు, పుష్పాలు, పత్రితో గణపతిని పూజించి, లడ్డూలు లేదా ఉండ్రాళ్లు నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రతి మాసంలోనూ వచ్చే సంకటహర చతుర్థినాడు ఇదేవిధంగా ఆచరించగలిగితే సకల దోషాలూ పోయి, కార్యజయం కలుగుతుంది. ప్రతి బహుళ చతుర్థినాడూ వినాయక చవితిరోజు చేసినట్లే పత్రితోనూ, పుష్పాలతోనూ గణపతికి పూజ చేస్తే అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతారు. కష్టాలతోనూ, సమస్యలతోనూ బాధపడేవారు సంకటహర చతుర్థి వ్రతంతోపాటు సంకట విమోచక గణపతి స్తోత్రాన్ని విడవకుండా ఆరుమాసాలపాటు పఠించడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. వ్రతాన్ని ఆచరించలేనివారు కనీసం సంకటహర గణపతి స్తోత్రాన్ని నాలుగుసార్లు పారాయణ చేసినా మంచిదే. ఈ వ్రతాచరణ వల్ల విఘ్నాలు తొలగి, పనులు సజావుగా సాగుతాయి. కేతుగ్రహ బాధలు తొలగుతాయి. -డి.వి.ఆర్. భాస్కర్ -
నేటి విశేషం.. సంకష్టహర చతుర్థీ
గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిథి... మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం!!... పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు, సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు... సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం:- సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి. అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి... సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. సంకట హర చతుర్ధి వ్రత కథ ఒకానొకప్పుడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి ( వినాయకుని గొప్ప భక్తుడు ) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెలుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపురాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడ సాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు.. ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా! అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు... సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, 'నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది, ఈ రోజు మరణించింది' అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేషుని దూతని అపుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు, ఆమె దేహం పై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది, దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు. ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.


