టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చీర, ఫ్యాషన్ వేర్ అయినా..ఎందులో అయినా సమంత లుక్ ఎవర్‌గ్రీన్ అనేలా ఆమె మార్క కనిపిస్తుంది. సింపుల్‌గా కనిపిస్తూ..హైలెట్ మెరిసేలా ఫ్యాషన్ స్టైల్‌ని అనుసరిస్తుందామె. ఈసారి కూడా అలానే చూడాటానికి చాలా సాదాచీర అనిపించేలా లగ్జరీయస్ లుక్‌లో మెరిసిందామె.
సమంత చీరల పట్ల ఉన్న ఇష్టాన్ని ఇలా ఏదో ఒక విధమైన స్టైల్‌లో కనిపిస్తూ..పరోక్షంగా చెబుతుంటారామె. ఆధునికత ఉట్టిపడేలా..మన సాంస్కృతికి చిహ్నమైన చేనేత చీరలో అదరహో అనిపించేలా ఉందామె ఆహార్యం. రాయల్ బ్లూ స్లిక్ చేనేత చీరలో రాకుమారిలా స్టైలిష్‌గా దర్శనమిచ్చింది.
ఈ చీరను డిజైనర్ రినా సింగ్ రూపొందించారు. ఆర్గాంజ్ టైపు చీరను ప్యాచ్‌వర్క్, జాక్వర్డ్ బుట్టితో డిజైన్ చేశారు. దానికి మ్యాచింగ్‌గా ఎంబ్రాయిడరీ చేసిన వీ నైక్ బ్లౌజ్‌ని జత చేయడంతో.. లుక్‌ని మరింత అందంగా మార్చింది. స్మోకీ కళ్లు, నిగనిగలాడే పెదవులతో కూడిన మేకప్ ఆమె అందాన్ని రెట్టింపు చేసింది.
ఈ చీర ధర ఎంతంటే..
సమంత ధరించిన చీర ధర రూ. 32,500 కాగా, బ్లౌజ్ ధర రూ. 12,500. మొత్తం ధర దాదాపు: రూ. 45,000 పలుకుతోంది. కాగా, సమంత చివరిసారిగా శుభం అనే చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు.
(చదవండి: Power Of Love: రోగాలతో ఒక్కటయ్యారు.. ఆ తర్వాత..)


