హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపధ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను హైదరాబాద్ లో ప్రధాన రహదారులకు పెట్టాలని నిర్ణయించారు. ెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ORR) వద్ద రావిర్యాలను నుంచి ప్రారంభమై ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేసే 100 మీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించారు.
రావిర్యాల ఇంటర్‌చేంజ్‌కు ఇప్పటికే “టాటా ఇంటర్‌చేంజ్” అని పేరు పెట్టారు.ప్రపంచంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ముందు నుంచే వెళ్లే ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో “డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ” అని నామకరణం చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేసింది.
ఈ నిర్ణయంపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి ప్రభుత్వం లేఖ రాయనుంది.మరిన్ని ప్రధాన రహదారులకు గ్లోబల్ దిగ్గజ కంపెనీల పేర్లు పెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సేవలను గుర్తిస్తూ ఒక ముఖ్య రహదారిని “గూగుల్ స్ట్రీట్” అని ప్రకటించేందుకు ప్రతిపాదనతో పాటు మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి:
రూ. 11 లక్షల కోట్లు ఇస్తే.. రూ. 8 లక్షల కోట్లు అప్పు ఎందుకు?


