‘ఏ హామీని అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారు’ | Union Minister Kishan Reddy Slams Congress Govt | Sakshi
Sakshi News home page

‘ఏ హామీని అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారు’

Dec 7 2025 5:53 PM | Updated on Dec 7 2025 6:01 PM

Union Minister Kishan Reddy Slams Congress Govt

నల్లగొండ:  ఏ హామీని అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  ప్రశ్నించారు. ఏ ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, మహిళలకు ఇస్తామన్న ఏ హామీని కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఈరోజు (ఆదివారం, డిసెంబర్‌ 7వ తేదీ) నల్లగొండ బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ‘పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్‌కి ఏ మాత్రం తేడా లేదు. దేవుడిపై ప్రమాణం చేసి హామీలు ఇచ్చిన రేవంత్ ఎన్నింటిని అమలు చేశారో చెప్పాలి,  ఒక్క నిరుద్యోగికి కూడా భృతి ఇవ్వలేదు. 

సన్నబియ్యంలో కేంద్రం 43 రూపాయలు ఇస్తోంది. రాష్ట్ర వాటా కేవలం 15 రూపాయలు మాత్రమే ఇస్తోంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో లక్షన్నర కేంద్రం వాట కింద ఇస్తోంది.  మహిళలకు ఇస్తామన్న ఏ హామీని అమలు చేయలేదు. ఏ హామీని అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారు

తెలంగాణలో సింగరేణి నుంచి హైటెక్ సిటీ వరకు విపరీతంగా భూ దందా సాగుతోంది భూములు అమ్మనిదే పూటగడవట్లేదు. మద్యం అమ్మకాలు విపరీతంగా పెంచారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం 42 వేల కోట్ల అప్పు ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ హయాంలో ఎలా ఉందో ఇప్పుడు అలానే తయారైంది. ాంగ్రెస్ ఇచ్చిన హామీలను రెండేళ్లలో ఎన్ని అమలు చేసిందో చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement