హైదరాబాద్: ప్రపంచానికి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పే విధంగా గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశ, విదేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు గ్లోబల్ సమ్మిట్‌కు వస్తున్నారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే యువతకు ఉద్యోగి ఉపాధి కల్పనలు కల్పించే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి గ్లోబల్ సమ్మిట్‌కు శ్రీకారం చుట్టారన్నారు.
‘బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో కుదేలు అయిన వ్యవస్థలను రేవంత్ రెడ్డి గాడిన పెట్టారు. గతంలో బిఆర్ఎస్ పాలనలో తప్పులు జరిగితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైలెంట్ గా వున్నారు. తెలంగాణకు 13 లక్షల కోట్లు కేంద్రం నుంచి తెచ్చామని కిషన్ రెడ్డి అంటున్నారు. తెలంగాణకు 13 లక్షల కోట్లు వస్తే 8 లక్షల కోట్లు అప్పు ఎందుకు అయింది
ప్రతి నెల 8వేల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు కడుతున్నాం. కుటుంబ పాలనలో తెలంగాణను దోచుకుంటుంటే కిషన్‌రెడ్డి ఎందుకు రాష్ట్రాన్ని కాపాడలేదు. రాష్ట్రం అప్పుల దిశగా వెళ్తుంటే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలతో రాష్ట్రాన్ని ఎందుకు రక్షించే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ ప్రజల ఓట్లతోనే కిషన్ రెడ్డి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి అయ్యారు. కిషన్‌రెడ్డి దొంగ లెక్కలతో రూ. 13 లక్షల కోట్లు తెచ్చామని అంటున్నారు. రూ. 13లక్షల కోట్లు ఏ శాఖకు తెచ్చారో కిషన్ రెడ్డి లెక్కలు చెప్పాలి. చౌరస్తాలో మైక్ తీసుకుని దొంగ లెక్కలు చెప్పడం కాదు 13 లక్షలు ఎప్పుడు తెచ్చారో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
తెలంగాణకు రావాల్సిన సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ రాత్రికి రాత్రి ఏపీకి తరలించారు. దీనిపై తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. 18వ లోక్ సభలో చంద్రబాబు నాయుడును ప్రసన్నం చేసుకోవడానికి మీ నాయకులు ఏపీకి సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ ఇచ్చారా...?, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్న చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సన్నబియ్యం ఉచితంగా ఇస్తున్నారా...? ఏ రాష్ట్రంలో అయినా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం బీజేపీ ఇచ్చిందా కిషన్ రెడ్డి చెప్పాలి’ అని సవాల్ విసిరారు.
ఇదీ చదవండి:
‘ఏ హామిని అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారు’


