పోలీస్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం | Fire Erupts at Armoor Police Station | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం

Mar 12 2026 6:39 PM | Updated on Mar 12 2026 9:13 PM

Fire Erupts at Armoor Police Station

సాక్షి, నిజామాబాద్‌: ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాధారణంగా రహదారులపై నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడ్డవారి వాహనాలను ఆ పోలీస్ స్టేషన్‌ వద్ద ఉంచుతారు. అలా పోలీసులు సీజ్‌ చేసి అక్కడ ఉంచిన బైక్‌లు, ఆటోలు, కార్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. పోలీస్ స్టేషన్‌ పరిసరాల్లో చెత్తను తగలబెట్టడంతో వాహనాలకు నిప్పు అంటుకుంది.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. వేసవికాలం కావడంతో అగ్ని ప్రమాదాలు జరిగితే అవకాశాలు అధికంగా ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచనలు చేస్తుంటారు. అటువంటిది పోలీస్‌ స్టేషన్‌లోనే అగ్ని ప్రమాదం జరగడం గమనార్హం. 


 

Advertisement
 
Advertisement
Advertisement