‘తెలంగాణ దిశా దశను మార్చనున్న గ్లోబల్ సమ్మిట్’ | Minister Ponguleti reviewed the arrangements for the Global Summit | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ దిశా దశను మార్చనున్న గ్లోబల్ సమ్మిట్’

Dec 7 2025 7:45 PM | Updated on Dec 7 2025 8:10 PM

Minister Ponguleti reviewed the arrangements for the Global Summit
  • ప్రపంచ ఉన్నత నగరాల స్థాయికి  ఫ్యూచర్ సిటీ
  • గ్లోబల్ సమ్మి ట్ ఏర్పాట్లను  పరిశీలించినరాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈనెల 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ తో తెలంగాణ రాష్ట్రం దిశ దిశ మారుతుందని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీర్  ఖాన్ పేట్ లో జరుగుతున్న సమ్మిట్ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. 

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఈ ప్రపంచ స్థాయి సమ్మేళనంతో ప్రపంచ నగరాల స్థాయికి ఫ్యూచర్ సిటీ  చేరుతుందని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం రెండేళ్ల పాలన, 2047 లక్ష్యంగా సాగుతున్న ప్రణాళికలు తదితరాలకు ఊతమిచ్చే విధంగా పెట్టుబడులు రానున్నాయని అన్నారు ఇప్పటికే  దేశ విదేశాలకు చెందిన 150 మంది అత్యంత ప్రముఖులు ఈ సమ్మిట్ లో పాల్గొనబోతున్నారని చెప్పారు రెండు రోజులపాటు జరిగే ఈ సమ్మేళనం కోసం విశేష రీతిలో ఏర్పాట్లు జరిగాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

‘ఏ హామీని అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement