రాష్ట్రానికి రూ.2,160 కోట్ల ‘ఇందిరమ్మ’ నిధులు! | Telangana govt releases over Rs 2160 crore under Indiramma housing scheme | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి రూ.2,160 కోట్ల ‘ఇందిరమ్మ’ నిధులు!

Feb 26 2026 5:23 AM | Updated on Feb 26 2026 5:23 AM

Telangana govt releases over Rs 2160 crore under Indiramma housing scheme

3 లక్షల పీఎంఏవై గ్రామీణ యూనిట్ల మంజూరుకు చాన్స్‌ 

మార్చి రెండో వారంలోగా స్పష్టత 

కేంద్ర నిధులు వస్తే ఖజానాకు పెద్ద ఊరట

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవటంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం అందించే నిధుల్లో క్రమంగా స్పష్టత వస్తోంది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం (పీఎంఏవై) కింద రాష్ట్రానికి ఈ నిధులు అందించాల్సి ఉంది. ఇప్పటికే ఆ పథకం కింద పట్టణ ప్రాంత ఇళ్లను కేంద్రం మంజూరు చేసిన విషయం తెలిసిందే. 1.3 లక్షల యూనిట్లు మంజూరు కావటంతో, దానికి సంబంధించి రూ.1,695 కోట్లు అందనున్నాయి.

ఇక ప్రధానంగా ఆశ పెట్టుకున్న గ్రామీణ ప్రాంత యూనిట్లపై స్పష్టత రావాల్సి ఉంది. 3 లక్షల యూనిట్లు మంజూరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచింది. ఆ మేరకు 3 లక్షల యూనిట్లు మంజూరయ్యే అవకాశం కనిపిస్తుండగా, అదే జరిగితే మరో రూ.2,160 కోట్లు అందనున్నాయి. ఇది ఇందిరమ్మ పథకం కొనసాగింపులో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఊరట ఇవ్వనుంది.  

పట్టణ ప్రాంత యూనిట్లు 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండు ఆర్థిక సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, కేంద్రం నుంచి పీఎంఏవై నిధులు అందలేదు. ఆ పథకం కింద నిధులు మంజూరు కావాలంటే, తమ విధివిధానాలను రాష్ట్రాలు కచి్చతంగా అమలు చేయాలన్నది కేంద్రం నిబంధన. కాగా అందులో తేడా వస్తే నిధులు మంజూరు చేయటం లేదు. రాష్ట్రంలో ఇందిరమ్మ పథకం అమలుకు శ్రీకారం చుట్టినప్పుడు, ఇక్కడ అనుసరించిన పద్ధతులు కేంద్రం విధివిధానాలకు అనుకూలంగా లేవు. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన తొలి ఏడాది కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రాలేదు.

రెండో ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. కేంద్ర నిబంధనలకు అనుకూలంగా మార్పు చేర్పులు చేసుకుంది. దీంతో పీఎంఏవై పట్టణ ప్రాంత యూనిట్లు మంజూరయ్యాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2.7 లక్షల యూనిట్లు కావాలని గట్టిగా కోరినప్పటికీ, 1.13 లక్షల యూనిట్లనే కేంద్రం మంజూరు చేసింది. పట్టణ ప్రాంత ఇళ్లకు సంబంధించి యూనిట్‌ కాస్ట్‌ రూ.లక్షన్నర ఉండటంతో, ఆ యూనిట్లు ఎంత ఎక్కువ మంజూరైతే అంత ఎక్కువ సాయం అందుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పట్టణ ప్రాంత పరిధిని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా చూపినా, కేంద్రం మాత్రం తక్కువే మంజూరు చేసింది.  

త్వరలో గ్రామీణ ప్రాంత యూనిట్లు 
ఇక వీలైనన్ని గ్రామీణ యూనిట్లు సాధించటంద్వారా ఎక్కు వ నిధులు పొందే యోచనలో భాగంగా 3 లక్షల యూనిట్లు మంజూరు చేయాలని రాష్ట్రం కోరింది. కాగా అర్బన్‌ యూని ట్లు అడిగినవన్ని ఇవ్వనందున, గ్రామీణ యూనిట్లు తెలంగాణ కోరినన్ని ఇచ్చే యోచనలో కేంద్రప్రభుత్వం ఉందని స మాచారం. మార్చి రెండో వారంలోగా గ్రామీణ ప్రాంతయూ నిట్లను మంజూరు చేస్తారని రాష్ట్రప్రభుత్వం ఆశిస్తోంది. మంజూరైతే ఒక్కో యూనిట్‌కు రూ.72 వేలు అందుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ యూనిట్‌ కాస్ట్‌ను రూ.5 లక్షలుగా అమలు చేస్తున్నందున, అందులో రూ.72 వేలు కేంద్రం భరిస్తే అంతమేర రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభిస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement