
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను హరీష్‌రావు దాఖలు చేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు.. లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు నిరాకరించింది. కాళేశ్వరంపై రేపు హైకోర్టులో విచారణ చేపడతామని ధర్మాసనం చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.