సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు మరింత పటిష్టం చేసేందుకు పోలీసుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పోలీసులు ‘ఆపరేషన్ కవచ్’ (Operation Kavach) పేరుతో అకస్మాత్తుగా నాకాబందీ చేపట్టారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో శుక్రవారం రాత్రి దాదాపు 5 వేల మంది పోలీసులతో ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా సీపీ సజ్జనార్.. కీలక సూచనలు చేశారు.
ఈ తనిఖీల్లో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, ఏఆర్, కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు పాల్గొన్నాయి. ప్రజా భద్రతకు చేస్తున్న తనిఖీలకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ కోరారు. అనుమానాస్పద కదలికలపై డయల్ 100కి సమాచారం ఇవ్వాలని సూచించారు. కమిషనరేట్ చరిత్రలో ఇంత మంది పోలీసులతో నాకాబందీ చేపట్టడం ఇదే తొలిసారి.
అనంతరం, సజ్జనార్ ట్విట్టర్ వేదికగా..‘హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసే దిశగా, నేడు రాత్రి 10 గంటల నుంచి 'ఆపరేషన్ కవచ్' (Operation Kavach) పేరుతో నగరవ్యాప్తంగా విస్తృతమైన నాకాబందీని నిర్వహిస్తున్నాము. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నాము. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో లా అండ్ ఆర్డర్ (Law & Order), ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్, బ్లూ కోల్ట్స్ మరియు పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా పాల్గొంటున్నాయి. ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో నగర పౌరులందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరుతున్నాము. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించగలరు. మీ భద్రత - మా బాధ్యత అని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసే దిశగా, నేడు రాత్రి 10 గంటల నుంచి 'ఆపరేషన్ కవచ్' (Operation Kavach) పేరుతో నగరవ్యాప్తంగా విస్తృతమైన నాకాబందీని నిర్వహిస్తున్నాము.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో దాదాపు… https://t.co/dhk2JfZtNv pic.twitter.com/ug95ULpNgD— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 5, 2025


