కార్ల కాన్వాయ్‌తో హల్‌చల్
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని మహ్మద్‌నగర్‌లో బీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రవియాదవ్ హల్‌చల్ చేశారు. శుక్రవారం తన మద్దతుదారులతో కలిసి మహ్మద్‌నగర్ నుంచి కౌడిపల్లి వరకు 22 ఫార్చ్యూనర్ కార్లతో పాటు మరికొన్ని కార్లతో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. ఇది మండలంలో చర్చనీయాంశంగా మారింది.
అభివృద్ధికి కట్టుబడతానంటూ..
‘అక్రమాలకు పాల్పడితే ఆస్తి జప్తు చేసుకోవచ్చ ని బాండ్ పేపర్ మీ చేతిలో పెడు తున్నా ..’ అని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్‌పేట సర్పంచ్ అభ్యర్థి చేర్యాల వాణి
అన్నీ ఏకగ్రీవమే..
జనగామ జిల్లా నర్మెట మండలం సూర్యబండ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని 8 వార్డులకు గాను 1నుంచి 3 వార్డులకు ఒక్కో నామినేషన్ దాఖలు కావడంతో..ఈ మూడు వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 5 వార్డులకు 12 మంది నామినేషన్లు వేశారు. అయితే ఒకరు అభ్యర్థి కులం ధ్రువీకరణ పత్రం (ఎస్టీ) జత పరచలేదు. మరో ఆరుగురు ప్రకటనదారు (అభ్యర్థి) స్థానంలో సాక్షి సంతకాలు చేయడంతో ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో మిగిలిన ఐదు వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి.


