
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కాళేశ్వరం నివేదిక సహా ఇతర అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమాచారం కానుంది. ఈ నెల 30 నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయి.
ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీలో స్పెషల్ సెషన్‌కు సంబంధించిన ఎజెండా ఖరారు కానుంది. మూడు లేదంటే ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించే యోచనలో ప్రభుత్వం ఉంది.
ఇదిలా ఉంటే.. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ రూపొందించిన నివేదికను అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నివేదికపై చర్చ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.