
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే కాళేశ్వరం కమిషన్ నివేదిక అసెంబ్లీకి రాబోతుందని ఆయన తెలిపారు. తెలంగాణ కేబినెట్ అనంతరం సీఎం రేవంత్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ‘ ఊరు, పేరు మార్చి అంచనాలు మించి కట్టిన ప్రాజెక్టు కూలింది. కాశేళ్వరం కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్రజాప్రతినిధులకు కమిషన్ నివేదిక ప్రతులను అందిస్తాం. స్వేచ్ఛగా అందరూ అభిప్రాయాలు చెప్పొచ్చు’ అని పేర్కొన్నారు.
అంతకుముందు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలం కావడానికి సూక్ష్మంగా అప్పటి సీఎం కేసీఆరేనని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన విషయాలు అబద్ధాలు అనేది కమిషన్ రిపోర్ట్‌తో బయటపడింది. మూడు బ్యారేజీల నిర్మాణం కేసీఆర్ సొంత, ఏకైక నిర్ణయం అంటూ ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. ఈటెల రాజేందర్ సైతం కాళేశ్వరం కమిషన్ ముందు చెప్పింది అవాస్తవం అనేది కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తేలింది. ఇది మా వ్యతిగత అభిప్రాయం కాదు...ఘోష్ కమిషన్ రిపోర్ట్ మాత్రమే’ అని ఆయన పేర్కొన్నారు.