బీఆర్‌కే భవన్‌కు హరీష్‌రావు.. లీగల్‌ టీమ్‌తో పోలీసుల వాగ్వాదం! | BRS Harish Rao And Kaleshwaram Commission Enquiry Update | Sakshi
Sakshi News home page

బీఆర్‌కే భవన్‌కు హరీష్‌రావు.. లీగల్‌ టీమ్‌తో పోలీసుల వాగ్వాదం!

Jun 9 2025 10:47 AM | Updated on Jun 9 2025 7:20 PM

BRS Harish Rao And Kaleshwaram Commission Enquiry Update

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి హరీష్‌ రావు.. కాళేశ్వరం కమిషన్ విచారణకు బయలుదేరారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌ నుంచి బీఆర్‌కే భవన్‌కు భారీ కాన్వాయ్‌తో హరీష్‌ రావు వెళ్లారు. ఈ సందర్భంగా జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు వివరించి, అసలు వాస్తవాలను తెలియజేస్తామన్నారు. ఇక, బీఆర్కే భవన్‌కు హరీష్‌ వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

మరోవైపు.. కాళేశ్వరం కమిషన్ ఆఫీసు వద్దకు బీఆర్‌ఎస్‌ లీగల్ టీమ్‌ చేరుకుంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీమ్‌, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్‌ఎస్ లీగల్‌ టీమ్‌.. ఓపెన్‌ కోర్టులో కూర్చున్న సమయంలో పోలీసులు వారి వద్దకు వెళ్లి.. ఇక్కడ అనుమతి లేదని, బయటకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా లీగల్‌ టీమ్‌ స్పందిస్తూ.. ఓపెన్ కోర్టులో ఎవరైనా ఉండవచ్చు.. రాకూడదని గెజిట్ ఇవ్వాలని పోలీసులకు తెలిపారు. దీంతో, వాగ్వాదం చోటుచేసుకుంది. 

అంతకుముందు హారీష్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోంది. రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాలరాస్తోంది. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్ ఇచ్చాం. రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కమిషన్ ఏర్పాటుచేసినా, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద పూర్తి గౌరవం, విశ్వాసం ఉన్న పార్టీ బీఆర్ఎస్. ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు వివరించి, అసలు వాస్తవాలను తెలియజేస్తాం. మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, అన్ని విషయాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్తాను.

Kaleshwaram Commission: 40 నిమిషాలు హరీశ్ రావును ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్

గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ మీద రాజకీయ కక్షతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం ఆలోచించవలసింది ఉద్దేశంతో కాదు, విజ్ఞతతో ఆలోచించాలి. రాజకీయ దుర్దేశంతో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రానికి, రైతులకు అన్యాయం చేస్తుంది. విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులను కాలరాయద్దు. రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. అంతిమంగా న్యాయం గెలుస్తుంది. ధర్మం గెలుస్తుంది. ఈ రోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం. మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తిస్థాయిలో సమాధానం చెప్తాం. మా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వంలో లేము కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్లను వారికి అందిస్తాం’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement