
హైదారాబాద్: ప్రభుత్వానికి చేరిన కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్ట్‌ను లాకర్‌లో పెట్టారు. దీనిపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి సమాచారం ఇచ్చిన సీఎస్ రామకృష్ణారావు... ఈ తుది నివేదికను లాకర్‌లో పెట్టారు. ఈ తుది నివేదికపై ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, సీఎస్ రామకృష్ణారావులు కీలక అధికారులతో భేటీ అయ్యారు.
కేబినెట్‌లో చర్చించే ముందు షీల్డ్ కవర్ ఓపెన్ చేయనుంది ప్రభుత్వం. ఈ నివేదికను కేబినెట్‌లో చర్చించిన తర్వాత లీగల్ ఒపీనియన్‌కు పంపనుంది ప్రభుత్వం. లీగల్ విషయాలపై అడ‍్వకేట్ జనరల్‌కి రిఫర్ చేయనుంది. దీనిపై లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో పెట్టే యోచనలో ఉంది తెలంగాణ సర్కారు.
కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశానికి సంబంధించి గురువారం బీఆర్‌కే భవన్‌కి వచ్చిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్.. షీల్డ్ కవర్‌లో రెండు డాక్యుమెంట్లను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జకు అందజేశారు. 500 పేజీల చొప్పున.. మొత్తం వెయ్యి పేజీలతో కమిషన్ తుది నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి అవకతవకలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సుమారు 15 నెలలపాటు విచారణ జరిపి తుది నివేదికను రూపొందించింది.