
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్(Smita Sabharwal)కు భారీ ఊరట లభించింది. కాళేశ్వరం నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాళేశ్వరం అవకతవకల అంశంపై పీసీ ఘోష్ కమిషన్(PC Ghosh Commission) ఇచ్చిన నివేదికను హైకోర్టులో ఆమె సవాల్ చేసిందే. నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్ చేసిన ఆమె.. ఆ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పిటిషన్‌ను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం ప్రస్తుతానికి ఆమెకు ఊరటనిస్తూ.. తదుపరి విచారణ వాయిదా వేసింది.