సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా సంచలనంగా మారింది. అనారోగ్య సమస్యల నేపథ్యంలో రాజీనామా చేశానని ఆయన చెబుతున్నారు. ముక్కోటి ఏకాదశి ముగిసిన వెంటనే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
యాదగిరిగుట్టలో అధ్యయనోత్సవాలు జరుగుతుండగా ఉన్నట్లుండి వెంకట్రావు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా వెనుక అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో తీవ్రస్థాయిలో విభేదాల నేపథ్యంలో రాజీనామా చేశారని యాదగిరిగుట్టలో చర్చ నడుస్తోంది.


