
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్మాల్(Smita Sabharwal) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
స్మితా సబర్వాల్ నాడు సీఎం కేసీఆర్(Ex CM KCR) అదనపు కార్యదర్శి హోదాలో పని చేశారు. అయితే కాళేశ్వరం కమిషన్ తనకు సాక్షిగా సమన్లు మాత్రమే జారీ చేసిందని, చట్టప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. ‘కాళేశ్వరం నిర్మాణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను బాధ్యురాలిని కాను. అప్పటి ముఖ్యమంత్రికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చానని. సీఎంవో ప్రత్యేక కార్యదర్శి హోదాలో 3 బరాజ్‌ల నిర్మాణ స్థలాలను కూడా సందర్శించానని కమిషన్ పేర్కొంది.
బరాజ్‌ల నిర్మాణానికి పరిపాలనా అనుమతి, ఆమోదాల మంజూరులో నా పాత్ర ఉందని చెప్పింది. సంబంధిత ఫైళ్లను కేబినెట్ ఆమోదం కోసం ఉంచనందుకు, నిబంధనలను ఉల్లంఘించినందుకు నాపై తీవ్ర చర్యలకు సిఫార్సు చేశారు. కమిషన్ నాపై పక్షపాతంతో పరువు నష్టం కలిగించేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ నివేదికను రద్దు చేయాలి’అని స్మిత పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఒకట్రెండు రోజుల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్(Justice Aparesh Kumar Singh) ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్.. అప్పుడే!