
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరుగుతోంది. పంచాయతీరాజ్, మున్సిపల్ బిల్లుల సందర్బంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు.. కాళేశ్వరం రిపోర్టుపై ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు చర్చ జరుగుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం రిపోర్టుపై సాయంత్రం చర్చ జరుగుతుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును హౌస్‌లో ఫ్లోర్ లీడర్లకు హార్డ్ కాపీ ఇచ్చాం. మెంబర్స్ అందరికీ సాఫ్ట్ కాపీనే ఇచ్చాం. సభలో సాయంత్రం చర్చ ఉంటుంది. ఎంత ఆలస్యం అయినా ఈ రోజు సభలో కాళేశ్వరంపై సంపూర్ణ చర్చ జరుగుతుంది. కేసీఆర్ తరఫున హరీష్ రావుకి కాపీ ఇచ్చాం. అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంటాం. కోర్టు విషయాలపై మాట్లాడను. సభలోనే అన్ని మాట్లాడతాం. చర్చ తర్వాతనే తదుపరి విచారణ ఏంటి దానిపై నిర్ణయం ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.