
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండో రోజు శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఎమ్మెల్యేలకు పెన్‌డ్రైవ్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చారు. ఈ సందర్బంగా కమిషన్ రిపోర్టులో పలు కీలక విషయాలను వెల్లడించింది.
కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రకారం..‘ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నిర్మాణం జరిగింది. మెయింటెనెన్స్ లేకపోవడం కారణంగానే మూడు బ్యారేజీలలో భారీగా డామేజ్ జరిగింది. క్వాలిటీ కంట్రోల్ విషయంలో నిర్మాణ సంస్థలు ప్రభుత్వాన్ని ప్లేట్ చేశాయి. నిబంధనలకు విరుద్ధంగా బ్యారేజీ నిర్మాణాలకు బడ్జెట్ విడుదల అయింది. మూడు బ్యారేజీల ప్లానింగ్, డిజైన్స్, నిర్మాణాన్ని మినిట్ టూ మినిట్ సీఎంకు ఫాలో అప్ చేశారు. మేడిగడ్డ నిర్మాణం కోసం నిపుణుల కమిటీ సిఫార్సు చేయకపోయినా ముఖ్యమంత్రి ఆదేశాలతో మేడిగడ్డ నిర్మాణం జరిగింది. సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇతర అంశాలపై క్యాబినెట్ అప్రూవల్ తీసుకోకపోవడం నిబంధనలకు విరుద్ధమే అవుతుంది అని తెలిపింది.
ఇదే సమయంలో అధికారులు తప్పిదాలను కాలేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఎత్తి చూపింది. అధికారులు తప్పు చేసినట్లు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు రిపోర్టులో పేర్కొంది. పలువురు చీఫ్ ఇంజనీర్లు కమిషన్ ముందు సరైన ఆధారాలు చూపించలేదని తెలిపింది. కమిషన్ రిపోర్టులో కేసీఆర్ పేరు కాకుండా చీప్ మినిస్టర్ పేరుతో రిపోర్ట్ ఇచ్చింది. ప్రాజెక్ట్ నిర్మాణం అంచనాలు పెంచి ప్రజా ధనం దుర్వినియోగం చేశారు. బ్యారేజీల నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేదు. అధికారులు జోషి హరిరామ్, మురళీధర్‌పై చర్యలు తీసుకోవాలి అని ఆరోపించింది.