30 లోపు ఇస్తాం.. కాళేశ్వరం కమిషన్ లేఖకు సీఎంవో రిఫ్లై | Kaleshwaram Commission Letter To Cmo | Sakshi
Sakshi News home page

ఆ సమాచారాన్ని 30 లోపు ఇస్తాం.. కాళేశ్వరం కమిషన్ లేఖకు సీఎంవో రిఫ్లై

Jun 21 2025 4:13 PM | Updated on Jun 21 2025 5:12 PM

Kaleshwaram Commission Letter To Cmo

సాక్షి, హైదరాబాద్‌: సీఎంవోకు కాళేశ్వరం కమిషన్‌ లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ అంశాలు కావాలని  కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్‌ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఇరిగేషన్‌ శాఖకు కాళేశ్వరం కమిషన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం కమిషన్ లేఖకు సీఎంవో రిప్లై ఇచ్చింది. 30వ తేదీ లోపు ఆయా శాఖలు కమిషన్ అడిగిన సమాచారం ఇస్తాయని సీఎంవో తెలిపింది. కమిషన్ అడిగిన సమాచారాన్ని ఆయా ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ శాఖకు సీఎంవో పంపించగా.. ఎల్లుండి కేబినెట్‌లో కాళేశ్వరం కమిషన్ లేఖపై సర్కార్‌ చర్చించనుంది.

కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ చేపట్టిన క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. మేడిగడ్డ బరాజ్‌ 2023 అక్టోబర్‌ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం లోపాలు బయటపడ్డాయి. ఈ మూడు బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌తో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ ఏర్పాటు చేసింది.

దీంతో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, పలువురు ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌లు, మాజీ మంత్రులకు కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించింది. కమిషన్‌ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుండగా, ఆ లోగానే ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది.    
 

 

Advertisement
 
Advertisement
Advertisement