
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను తమకు ఇవ్వాలని సీఎస్ రామకృష్ణారావుకు విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు. ఈ మేరకు నేడు(శుక్రవారం, ఆగస్టు 8వ తేదీ) సీఎస్‌తో సమావేశమయ్యారు హరీశ్. స్వల్ప సమయం పాట మాత్రమే సీఎస్‌తో భేటీ అయిన హరీశ్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే 665 పేజీల నివేదిక ఇచ్చిందో దాన్ని తమకు ఇవ్వాలని కోరారు.
ఇదిలా ఉంచితే, కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని తెలంగాణ ప్రభుత్వం సృష్టం చేసిన సంగతి తెలిసిందే.‘ ఊరు, పేరు మార్చి అంచనాలు మించి కట్టిన ప్రాజెక్టు కూలిందని, కాశేళ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది
దీనిలో భాగంగా ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టకముందే పరిశీలించాలనే యోచనలో బీఆర్‌ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ఆ నివేదికను తీసుకుని అసలు కమిషన్ ఏం చెప్పింది అనే అంశాన్ని అధ్యయనం చేయాలని బీఆర్‌ఎస్ భావనగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెబుతున్న బీఆర్‌ఎస్.. అది కాంగ్రెస్ కమిషన్ అంటూ కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.