‘42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం’ | Minister Ponnam Prabhakar On Local Body Elections BC Reservations | Sakshi
Sakshi News home page

‘42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం’

Oct 8 2025 8:48 PM | Updated on Oct 8 2025 9:30 PM

Minister Ponnam Prabhakar On Local Body Elections BC Reservations

హైదరాబాద్‌:  బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని మంత్రి పొన్నం ప్రబాకర్‌ ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ హైకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు పై ప్రభుత్వం తరపున మా వాదనలు బలంగా వినిపించాం. దేశంలో తొలి రాష్ట్రంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్తున్నాం. సభలో మీరు మాట్లాడినప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ,తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టంగా మద్దతు ఇచ్చారు. బలహీన వర్గాల సామాజిక న్యాయం అమలు దృశ్య రాజకీయాలకు పోకుండా ఐక్యంగా ఉండాలి. చర్చల్లో సభ ఏకగ్రీవ తీర్మానం పై జరిగింది. కోర్టులో అఫిడవిట్‌లు ఉండవు ఇంప్లీడ్ కావాలని కోరాం..

ఎంపైరికల్ డేటా కు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ వేసి సబ్ కమిటీ వేసుకొని 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసుకున్నాం. రాజకీయాలు పక్కన పెట్టీ సభలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు కోర్టులో బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఏంఐఎం పార్టీలు ఇంప్లీడ్ కావాలి’అని పొన్నం కోరారు. 

ఇదీ చదవండి:

బీసీ రిజర్వేషన్లు: ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నల వర్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement