కేసీఆర్‌ విచారణలో కీలక మార్పులు! | Changes in the KCR Kaleshwaram Commission investigation | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ విచారణలో కీలక మార్పులు!

Jun 10 2025 5:24 PM | Updated on Jun 10 2025 9:22 PM

Changes in the KCR Kaleshwaram Commission investigation

సాక్షి,హైదరాబాద్‌:  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కాళేశ్వరం కమిషన్‌ విచారణలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రేపు (బుధవారం) కేసీఆర్‌ను నేరుగా విచారిస్తామని, అంగీకరించకపోతే ఇన్‌ కెమెరా విచారణ చేపడతామని కాళేశ్వరం కమీషన్‌ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, అంతకుందు కేసీఆర్‌ను ఓపెన్ కోర్ట్ కాకుండా ఇన్ కెమెరా విచారణ చేస్తే ఎలా ఉంటుందని కమిషన్  యోచించింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్‌ ఇన్ కెమెరా విచారణ? చేపట్టనుందని వార్తలు వచ్చాయి. బహిరంగ విచారణకు కేసీఆర్‌ హాజరు కాకుండా ఇన్ కెమెరా ముందే కమిషన్ విచారణలో పాల్గొనే అవకాశం కేసీఆర్‌కు కలిగింది. కమిషన్ అడిగే ప్రశ్నలకు ఇన్ కెమెరా సమాధానం చెప్పాల్సి ఉంది.

 ఇప్పటి వరకు కమిషన్ ముందు పాల్గొన్న వారిని ఓపెన్ కోర్టులోనే కమిషన్‌ విచారించింది. కేసీఆర్‌ను మాత్రం మాజీ సీఎం హోదాలో ఇన్‌ కెమెరా విచారణకు హాజరయ్యే అవకాశం కల్పించింది. కాగా, రేపు కమిషన్ ముందు 115 సాక్షిగా కమిషన్ ముందు కేసీఆర్ హాజరు అవుతారా? ఇన్‌ కెమెరాకు హాజరవుతురా? అనేది తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement