
సాక్షి,హైదరాబాద్: సీబీఐ చేతికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని కోఠి సీబీఐ కార్యాలయంలో అధికారులతో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యటనపై ప్రాధాన్యత నెలకొంది.
కాళేశ్వరం ప్రాజెక్టు కేసు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది. రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఈ నెల 1న సీబీఐ డైరెక్టర్‌కు, కేంద్ర హోంశాఖకు పంపారు. ఈ క్రమంలో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్ రావడం చర్చాంశనీయంగా మారింది.