
హైదరాబాద్: దసరా ఉత్సవాల్లో భాగంగా నగరంలో నిర్వహించిన ఓ బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది. సరూర్‌నగర్ స్టేడియంలో ఈరోజ(సెప్టెంబర్ 29) నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్‌లో చోటు దక్కించుకుంది.

64 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ బతుకమ్మ చుట్టూలయ బద్ధంగా ఆడిన నృత్యం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.

‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.., ఒక్కేసి పువ్వేసి సందమామా.. చిత్తూచిత్తూల బొమ్మ.. శివుని ముద్దుల గు మ్మ.. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోనా’అంటూ బతుకమ్మ పాటలతో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం మార్మోగింది.
















