స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు | Telangana High Court Reserves Verdict On Local Body Elections | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు

Jun 23 2025 3:12 PM | Updated on Jun 23 2025 5:10 PM

Telangana High Court Reserves Verdict On Local Body Elections

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఇవాళ (జూన్ 23, 2025న) జరిగిన విచారణలో పిటిషనర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తమ వాదనలు వినిపించింది. దీనిలో భాగంగా ఎన్ని రోజుల్లో ఎన్నికల నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. 

గత  ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం.. ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని అడిగింది. దీనికి ప్రభుత్వం సమాధానమిస్తూ.. సమయం కావాలని కోరింది.  అయితే ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎన్నికల కమిషన్‌ కూడా కోర్టుకు విన్నవించింది. ప్రభుత్వం తమ ప్రక్రియ పూర్తి చేస్తే తాము ఎన్నికల నిర్వహణకు ముందుకెళతామని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. 

కాగా, 2024 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి తెలంగాణ సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసింది. దాంతో ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని నిబంధనను గుర్తు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికలైనా పెట్టండి.. లేదా పాత సర్పంచ్‌లనే కొనసాగించండి అని పిటిషనర్లు వాదనలు వినిపించారు. పిటిషనర్లలో కొంతమంది పౌరులతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement