పాశమైలారంలో ఇది మూడో ఘటన: హరీష్‌రావు | Harish rao Slams Govt Over Patancheru Pashamylaram Incident | Sakshi
Sakshi News home page

పాశమైలారంలో ఇది మూడో ఘటన.. ప్రభుత్వానిదే బాధ్యత: హరీష్‌రావు

Jun 30 2025 2:15 PM | Updated on Jun 30 2025 4:02 PM

Harish rao Slams Govt Over Patancheru Pashamylaram Incident

పాశమైలారం ఘటన ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి హరీష్‌ రావు అన్నారు. బాధితులకు భారీగా పరిహారం అందించాలని డిమాండ్‌ చేసిన ఆయన.. ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.  

సాక్షి, సంగారెడ్డి: పటాన్‌చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలో కెమికల్‌ ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారాయన. సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘పాశమైలారంలో ఈ మధ్యకాలంలో జరిగిన ఇది మూడో ఘటన. అయినా కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. ఈ ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలి. ఎంత మంది చనిపోయారో కూడా క్లారిటీ లేదు. ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి. గాయపడిన వాళ్లకు రూ. 50 లక్షలు అందించాలి’’ అని ప్రభుత్వాన్ని హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు. 

గాయపడ్డ 26 మందికి ఆస్పత్రుల్లో చికిత్స అందుతోంది. వాళ్లకు మెరుగైన వైద్యం అందాలి. అవసరమైతే కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందించాలి అని హరీష్‌ రావు కోరారు.  సోమవారం ఉదయం 9గం. ప్రాంతంలో పాశమైలారంలోని కెమికల్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌ సహా చాలా ప్రాంతం కుప్పకూలిపోగా.. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement