మేడారం జాతర.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం | Telangana Government Allocates ₹150 Crore for Sammakka Saralamma Jatara Infrastructure Development | Sakshi
Sakshi News home page

మేడారం జాతర.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

Aug 20 2025 2:58 PM | Updated on Aug 20 2025 3:13 PM

Telangana Government Allocates Rs 150 Crore For Medaram Jatara

సాక్షి, వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గిరిజనుల ఆధ్యాత్మిక కుంభమేళా అనబడే ఈ మహోత్సవం విజయవంతంగా సాగేందుకు, మేడారంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించబోయే మేడారం మహా జాతర ఎన్నడూ లేని రీతిలో వైభవోపేతంగా జరగనుందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంజూరు చేసిన నిధుల పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అట్లూరు లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. “ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గిరిజనుల గౌరవానికి ప్రతీక. మేడారం మహా జాతర కోసం 150 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, గిరిజనులపట్ల సీఎం రేవంత్‌రెడ్డి కట్టుబాటు, మద్దతుకు నిదర్శనం. ఈ సారి జాతర మరింత గొప్పగా, చారిత్రాత్మకంగా జరుగుతుంది” అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement