
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్‌వీఎస్‌రెడ్డి నియమితులయ్యారు. అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ సలహాదారుగా రెండేళ్లపాటు ఆయన కొనసాగనున్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, ఉమెన్ అండ్ చైల్డ్‌వెల్ఫైర్ డైరెక్టర్‌గా శ్రుతి ఓజా, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా కృష్ణ ఆదిత్య, హెచ్‌ఎండీఏ సెక్రటరీగా కోటా శ్రీవాత్స, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా ఎం.రాజారెడ్డి నియమితులయ్యారు.