
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీకాలం మరో 3 నెలలు పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్టు అధికార వర్గాల సమాచారం. ఏప్రిల్ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు ఈనెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది.
అయితే ఆయన పదవీకాలం పొడిగించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో మరో మూడు నెలలు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగే అవకాశం ఏర్పడింది. రామకృష్ణారావు పదవీ విరమణ చేస్తే ఆయన స్థానంలో సీఎస్‌గా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్‌రంజన్, వికాస్‌రాజ్ పోటీలో ఉన్నా రు. కేంద్ర సరీ్వసులో ఉన్న సంజయ్ జాజు రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా లేరని సమాచారం. అలాగే ఢిల్లీలో తెలంగాణ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయల్‌కు సీఎస్‌గా అవకాశం లేదని సమాచారం.