
సాక్షి,హైదరాబాద్: అందాల పోటీల మీదే కాదు అగ్ని ప్రమాదాల మీద కూడా ఫోకస్ పెట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి హితువు పలికారు. ఆదివారం ఉదయం చోటు చేసుకున్న పాతబస్తీ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని బీఆర్‌ఎస్ నేతలు పరిశీలించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..‘అగ్ని ప్రమాదంలో మరో ప్రాణం పోకుండా చూడండి. రాజకీయంగా మాట్లాడడానికి రాలేదు. ప్రభుత్వాలు ప్రజలకు ప్రాణాలు కాపాడాలి. రూ.5 లక్షల పరిహారం ఇవ్వడం కాదు ప్రాణాలపై దృష్టి పెట్టాలి. రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.
ముఖ్యమంత్రే హోమ్ మినిస్టర్‌గా ఉన్నారు కాబట్టి ఘటన స్థలానికి వచ్చి ఉంటే అధికారులు ఇంకా బాగా పనిచేసేవారు.సమ్మర్ వచ్చే ముందు అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. ఫైర్ ఇంజన్లు వచ్చాయి కానీ వాటర్ లేవు. సిబ్బందికి సరైన మాస్కులు లేవు. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్లు లేకపోవడం దురదృష్టకరం.హైదరాబాదులో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం.నిన్నటి రోజు దుర్భరమైన రోజుగా ప్రమాద ఘటనపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని’ అన్నారు.