
సాక్షి,హైదరాబాద్: బతుకమ్మ వేడుకల కోసం ట్యాంక్ బండ్ ముస్తాబైంది. వందలాది మంది మహిళలు అక్కడకు చేరుకుని బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో 500 మంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్నారు. అమర జ్యోతి స్థూపం నుంచి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వరకు 700 బతుకమ్మలతో ర్యాలీ చేయనున్నారు.


