హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి కోసం ‘తెలంగాణ టూరిజం హోమ్ స్టే’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రపంచ స్థాయి సేవలు, పరిశుభ్రమైన వసతి, కుటుంబ వాతావరణంలో స్థానిక సంప్రదాయాల అనుభవం లాంటి ఈ మూడు లక్ష్యాలతో ముందుకు వస్తున్న ఈ పథకం ద్వారా జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలు , పర్యాటక గమ్యస్థానాల్లో వసతిని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
దేశీయ, విదేశీ పర్యాటకులు తెలంగాణలోని సంప్రదాయ జీవన విధానాన్ని దగ్గరగా చూడటానికి, స్థానిక వంటకాల అద్భుత రుచిని ఆస్వాదించేందుకు ఈ హోమ్ స్టేలు ఉపయోగపడనున్నాయి. రాష్ట్ర పర్యాటకశాఖ దీనిని ప్రమాణితమైన, భద్రత కలిగిన, సౌకర్యవంతమైన వసతి వ్యవస్థగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
హోమ్ స్టే కోసం వర్గీకరణ, పునర్వర్గీకరణ రుసుములు
హోమ్ స్టేలు వెండి (Silver), బంగారం (Gold) వంటి రెండు వర్గాల్లో వర్గీకరించబడతాయి. వర్గీకరణ,పునర్వర్గీకరణ కోసం దరఖాస్తు రుసుములు:
డిమాండ్ డ్రాప్ట్ను "కమిషనర్ / డైరెక్టర్ ఆఫ్ టూరిజం, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్" పేరుపై చెల్లించాల్సి ఉంటుంది.


