
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయోగంగా చూపించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని.. అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు(Notices To KCR) జారీ అయ్యానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(Kalvakuntla Rama Rao) అన్నారు. పాలన చేతకాక ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని మండిపడ్డారాయన.
రేవంత్ సర్కార్(Revanth Sarkar)కు కమీషన్లు తప్ప.. పాలన చేత కాదు. ప్రజాపాలన కాస్త పర్సంటేజీల పాలనగా మారింది. 20 నుంచి 30 శాతం కమీషన్లు, పర్సంటేజీలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వంలో ఏ పని జరగదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా చెపుతున్నారు. తమ అవినీతి కమిషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) నోటీసుల డ్రామా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోంది. అందులో భాగంగానే ఈ నోటీసులు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం ఓ చిల్లర ప్రయత్నం. ఇలా ఎన్నో నోటీసులు ఇచ్చినా దుదీ పించల్లా ఎగిరి పోతాయి.
కమిటీల పేరుతో, కమిషన్‌ల పేరుతో కాలయాపన చేస్తూ.. ఆరు గ్యారంటీల(Six Guarantees) అమలును పక్కనపెడదామనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను చూస్తూ ఊరుకోబోం. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి’’ అని కేటీఆర్ అన్నారు.
ఇదీ చదవండి: కేసీఆర్ చట్టానికేమైనా అతీతుడా?