BC Reservations: తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం? | Telangana Govt Approaches Supreme Court Over BC Reservations HC Order, More Details Inside | Sakshi
Sakshi News home page

BC Reservations: తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం?

Oct 11 2025 8:53 AM | Updated on Oct 11 2025 10:49 AM

Telangana Govt Approaches Supreme Court Over BC Reservations HC Order

సాక్షి, హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా హైకోర్టు ఆర్డర్‌ కాపీ విడుదల కాగా.. దానిని అధ్యయనం చేసిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌ల జీవోను, ఎన్నికల నోటిఫికేషన్‌ అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని, హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతి కోరాలని, ఈ మేరకు సీనియర్‌ కౌన్సిల్‌తో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సోమవారం పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది.

ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రధానంగా వాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి, బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్‌లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్‌ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. ఇదిలా ఉంటే..

రిజర్వేషన్‌ల జీవో 9ను సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసిన బీ మాధవరెడ్డి, మరొకరు.. సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేశారు. రిజర్వేషన్‌లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు.

ఇదీ చదవండి: ‘అలాగైతే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు’.. : తెలంగాణ హైకోర్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement