తెలంగాణ పోలీస్‌ బాస్‌ ఎవరంటే? | UPSC Shortlists 3 IPS Officers for Telangana DGP Post | Sakshi
Sakshi News home page

Telangana New DGP: తెలంగాణ పోలీస్‌ బాస్‌ ఎవరంటే?

Mar 19 2026 11:40 AM | Updated on Mar 19 2026 1:32 PM

UPSC Shortlists 3 IPS Officers for Telangana DGP Post

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో పోలీసు వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి వచ్చే నెలలో పదవీ విరమణ చేయనుండటంతో, కొత్త డీజీపీ నియామకానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది.  ఈ క్రమంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) రాష్ట్ర ప్రభుత్వానికి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను పంపింది. ఆ జాబితాలో సీవీ ఆనంద్, వినాయక్‌  ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా ఉన్నట్లు సమాచారం.     

డీజీపీ ఎంపికలో సాధారణంగా అధికారుల అనుభవం, సేవా రికార్డు, రాష్ట్రానికి చేసిన కృషి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సీవీ ఆనంద్‌కి నగర పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రభాకర్ ఆప్టే వివిధ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సౌమ్య మిశ్రా కూడా తన సేవా కాలంలో అనేక ముఖ్యమైన పదవులను చేపట్టారు. ఈ ముగ్గురిలో ఎవరు కొత్తగా తెలంగాణ పోలీస్ వ్యవస్థకు నాయకత్వం వహిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

శివధర్ రెడ్డి పదవీ విరమణతో, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థలో కొత్త నాయకత్వం అవసరం ఏర్పడింది. కొత్త డీజీపీ నియామకం రాష్ట్రంలో చట్టం, శాంతి పరిరక్షణలో కీలక పాత్ర పోషించనుంది. ఇక ఈ ముగ్గురు అధికారులలో ఎవరు డీజీపీ? అనేది త్వరలో స్పష్టత రానుంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement