సాక్షి,హైదరాబాద్:
- అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్
- మూసి అభివృద్ధిపై ప్రభుత్వం ఇచ్చిన సంతృప్తికరంగా లేనందున BRS వాకౌట్
- మూసి- డీపీఆర్ లేదు అని ప్రకటన చేశారు -మంత్రి డీపీఆర్ రెడీగా ఉన్నదని ప్రకటించారు.
- మూసిపై డీపీఆర్ ఉంటే అసెంబ్లీలో టేబుల్ చేయాలి.
- ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్లకు నోటీసులు ఎందుకు ఇచ్చారు?
- మూసి అభివృద్ధిపై ప్రభుత్వానికి క్లారిటీ లేదు - కేటీఆర్
- లక్షన్నర కోట్ల దోపిడీకి మేము దూరం - మూసి అభివృద్ధికి కాదు.
మొక్కజొన్న రైతుకు మద్దతుగా హరీష్
- 8 లక్షల ఎకరాల్లో మొక్కలు రైతులు పండించారు.
- మద్దతు ధర లేక రైతులు నష్ట పోతున్నారు
- వర్షాల కారణంగా రైతులు నష్ట పోతున్నారు
- 25 శాతం పంట దళారుల చేతికి వెళ్లింది
- పంటల బీమా అమలు చేయడం లేదు
- వడగండ్ల వానతో రైతులు నష్ట పోయారు
- ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వరు..వెంటనే ఇవ్వాలి
- 2400 మద్దతు ధర..500 బోనస్ వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
- మొక్కజొన్న రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల చేపట్టిన నిరసన
- అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద ధర్నా చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్
- ఈ సమయంలో తోపులాట జరిగి మాజీ మంత్రి హరీష్ రావు చేతికి గాయం
- మొక్కజొన్న రైతులకు మద్దతుగా గన్‌పార్క్ వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన
- మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
- మొక్క జొన్నకు 500 బోనస్ ప్రకటించాలి
- మొక్క జొన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన


