Live Updates

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం లైవ్ అప్‌డేట్స్
బాలాపూర్ గణేషుడి శోభాయాత్రకు ఆటంకం.
- బాలాపూర్ గణేషుడి శోభాయాత్రకు ఆటంకం.
- ఈసారి విగ్రహం సైజు పెరగడంతో వీధిలో పట్టని విగ్రహం.
- రేకుల షెడ్డు అడ్డుగా రావడంతో ఆగిపోయిన శోభాయాత్ర.
- రేకుల షెడ్డు తొలగిస్తున్న నిర్వాహకులు.
- ఉదయం 10 గంటలకు బాలాపూర్ లడ్డూ వేలం.
ఖైరతాబాద్ గణేశుడికి భారీ గజమాల
- ఖైరతాబాద్ గణేశుడికి భారీ గజమాల వేసిన ఉత్సవ కమిటీ
- గణనాథుడిపైకి పూలు చల్లుతూ, డోలు వాయిస్తూ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు
- ఖైరతాబాద్ గణేశుడి వాహనం చుట్టూ రోప్‌పార్టీ ఏర్పాటు చేసిన పోలీసులు
- టెలిఫోన్ భవన్- ఇక్బాల్ మినార్ చౌరస్తా మీదుగా ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర
- తెలుగుతల్లి ఫ్లైఓవర్, సచివాలయం మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు ఖైరతాబాద్ గణేశుడు
- మధ్యాహ్నం 1.30 గం.కు ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తయ్యే అవకాశం
- నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్ చుట్టూ 11 పెద్ద క్రేన్‌లతో సహా 40 క్రేన్‌లు ఏర్పాటు
- బాహుబలి క్రేన్ పాయింట్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం
- నిమజ్జన కార్యక్రమంలో 10 లక్షలమంది భక్తులు పాల్గొనే అవకాశం
రూ.2.31 కోట్లు రికార్డు ధర పలికిన లడ్డూ
- బండ్లగూడ జాగీర్‌లో శుక్రవారం రికార్డు ధర పలికిన లడ్డూ
- వేలంలో రూ.2,31,95,000 పైగా చెల్లించి లడ్డూ దక్కించుకున్న కీర్తి రిచ్మండ్ విల్లావాసులు
- గతేడాది ఇదే కమ్యూనిటీలో రూ.1.87 కోట్లు పలికిన లడ్డూ ధర
Keerthi Richmond Villas : 10-kg Ganesh laddu auctioned for record ₹2.32 crore in Hyderabad’s Bandlaguda
₹45 lakh higher than last year’s ₹1.87 crore.
RV Diya Charitable Trust, which supports over 42 NGOs.
These organisations work in areas ranging from old-age care,… pic.twitter.com/NK0nHrysVY— Hyderabad Real Estate Urban (@HydUrbanRealty) September 6, 2025
కాసేపట్లో బాలాపూర్ గణనాథుడి ఊరేగింపు

- బాలాపూర్ గణనాథుడి పూజా కార్యక్రమం పూర్తి
- కాసేపట్లో బాలాపూర్ గణనాథుడి ఊరేగింపు ప్రారంభం
- బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొననున్న 38 మంది సభ్యులు
- రూ.30.01 లక్షల డిపాజిట్ చేసిన లడ్డూ వేలంలో పాల్గొననున్న సభ్యులు
- రూ.5 వేలు నాన్‌రీఫండబుల్ డిపాజిట్ చేసిన లడ్డూ వేలంలో పాల్గొననున్న సభ్యులు
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం

- సంప్రదాయ మేళ తాళాలతో ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర
- ఖైరతాబాద్ గణేశుడికి భారీ గజమాల వేసిన ఉత్సవ కమిటీ
- మధ్యాహ్నం రెండు గంటలకు ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తయ్యే అవకాశం
- నిమజ్జన కార్యక్రమంలో 10 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం
- అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల ఏర్పాట్లు
- రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్న 3,200 మంది ట్రాఫిక్ పోలీసులు
గణేష్ శోభాయాత్ర నిమజ్జనానికి సర్వం సిద్ధం..
- 29వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు..
- 3200 మంది ట్రాఫిక్ పోలీసుల విధులు..
- 1000 సీసీ కెమెరాలతో కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షణ..
- హైదరాబాద్ కమిషనరేట్‌లో కొత్తగా 40 హైరైస్ సీసీ కెమెరాలు..
- 360 డిగ్రీస్ వ్యూ.. రెండు కిలోమీటర్ల మేర సీసీ కెమెరాతో గస్తీ..
- ప్రత్యేక డ్రోన్ కెమెరాలతో పాటు హై రేస్ సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్న పోలీసులు..
- మహిళల భద్రత కోసం పెద్ద సంఖ్యలో మఫ్టీలో షీ టీమ్స్..
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

- సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు.
- కూకట్‌పల్లి ఐడీఎల్ రోడ్ బంద్.
- మాదాపూర్, హైటెక్ సిటీ, జేఎన్‌టీయూ వైపు వాహనాలు మళ్లింపు.
- ప్రగతినగర్ లేక్ రోడ్ మూసివేత.. నిజాంపేట్ రూట్‌లో మళ్లింపు.
- జీడిమెట్ల కట్ట మైసమ్మ ట్యాంక్ వద్ద భారీగా వాహనాల మళ్లింపు
- రాజేంద్రనగర్ పత్తికుంట ట్యాంక్ వద్ద రహదారి మూసివేత.
మెట్రో సమయం పొడిగింపు

- గణేష్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా మెట్రో సమయం పొడిగింపు
- అన్ని మెట్రోస్టేషన్ల నుంచి ఉదయం ఆరు నుంచి రాత్రి ఒంటి గంట వరకు రైలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- గణేష్ నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ఉదయం 6 నుంచి రేపు ఉదయం 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- బాలాపూర్ నుంచి చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ మీదుగా శోభాయాత్ర
- సికింద్రాబాద్ నుంచి ప్యాట్నీ, ప్యారడైజ్, ట్యాంక్‌బండ్ మీదుగా శోభాయాత్ర
- టోలిచౌకీ, మెహిదీపట్నం నుంచి వచ్చిన విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్‌రోడ్డుకు మళ్లింపు
- టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్ నుంచి వచ్చిన విగ్రహాలు ఎంజే మార్కెట్ వైపు మళ్లింపు
- ప్రధాన మార్గాలపై ఇతర వాహనాలకు అనుమతి లేదన్న ట్రాఫిక్ పోలీసులు
బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట ఇలా..
- 31 ఏళ్లుగా కొనసాగుతున్న బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట
- బాలాపూర్ గణేశ్ లడ్డూ కోసం స్థానికులు, స్థానికేతరుల మధ్య తీవ్ర పోటీ
- లడ్డూ వేలంపాటలో పాల్గొనే వ్యక్తులు ఉత్సవ సమితి వద్ద రూ.5 వేలతో పేర్లు నమోదు
- గతేడాది రికార్డుస్థాయిలో ధర పలికిన బాలాపూర్ గణేశుడి లడ్డూ
- 2024లో రూ. 30.01 లక్షలు పలికిన బాలాపూర్ గణేశుడి లడ్డూ
- 2023లో రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ గణేశుడి లడ్డూ
- 2021లో రూ. 18.90 లక్షలు, 2022లో రూ.24.60 లక్షలు పలికిన లడ్డూ
- 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలంపాటను రద్దు చేసిన ఉత్సవ సమితి
- 2018లో రూ.16.60 లక్షలు, 2019లో రూ.17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
- 2016లో రూ. 14. 65 లక్షలు, 2017లో రూ. 15.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
- 1994 నుంచి బాలాపూర్‌లో కొనసాగుతున్న గణేశ్ లడ్డూ వేలంపాట
- 1994లో రూ.450 తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలంపాట
- బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాటకు 380 మంది పోలీసులతో భద్రత
- 85 సీసీ టీవీ కెమెరాలతో భద్రత ఏర్పాటు చేసిన రాచకొండ పోలీసులు
40 గంటల పాటు కొనసాగనున్న నిమజ్జన కార్యక్రమం
- హైదరాబాద్‌లో దాదాపు 40 గంటల పాటు కొనసాగనున్న నిమజ్జన కార్యక్రమం
- హుస్సేన్‌సాగర్‌లో 50 వేల విగ్రహాల నిమజ్జనం అవుతాయని అంచనా
- బందోబస్తు విధుల్లో 30వేలకు మందికిపైగా పోలీసులు
- అదనంగా మరో 3,200 మంది ట్రాఫిక్ పోలీసులు
- విగ్రహం తరలింపు వాహనానికి క్యూఆర్ కోడ్ జారీ చేసిన పోలీసులు
- ఇతర కమిషనరేట్ల నుంచి వచ్చే వాహనాలకు కలర్ స్టిక్కరింగ్
- 250 తాత్కాలిక సీసీ కెమెరాల ఏర్పాటు, 9 డ్రోన్‌లతో గస్తీ
- ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లోనే మూడు వేలకు పైగా పోలీసులతో బందోబస్తు
- ట్యాంక్‌బండ్, హుస్సేన్‌సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్‌ల ఏర్పాటు
- నిమజ్జనం వీక్షించేందుకు 10లక్షల మంది వస్తారని పోలీసుల అంచనా
బాలాపూర్‌లో గణేశుడి ఊరేగింపు
- ఉదయం 6.30 గంటల నుంచి బాలాపూర్‌లో గణేశుడి ఊరేగింపు
- ఉదయం 5 గంటలకు చివరి పూజ చేయనున్న బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి
- ఉదయం 6.30 గంటల నుంచి బాలాపూర్‌లో గణేశుడి ఊరేగింపు
- ఉదయం 8.30 గంటలకు పూర్తికానున్న బాలాపూర్ గణేశుడి ఊరేగింపు
- ఉదయం 9.30 గంటలకు బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట
- గ్రామ బొడ్రాయి వద్ద బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట
- లడ్డూ వేలం పాట తర్వాత హుస్సేన్‌సాగర్ వైపు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర
- బాలాపూర్ నుంచి 16 కిలోమీటర్ల మేర సాగనున్న గణేశుడి శోభాయాత్ర
- బాలాపూర్- చాంద్రయాణగుట్ట- ఫలక్‌నుమా మీదుగా శోభాయాత్ర
- చార్మినార్- అఫ్జల్‌గంజ్- ఎంజే మార్కెట్ మీదుగా శోభాయాత్ర
- అబిడ్స్-లిబర్టీ చౌరస్తా మీదుగా ట్యాంక్‌బండ్ చేరుకోనున్న శోభాయాత్ర
ట్యాంక్ బండ్‌పై కొనసాగుతున్న వినాయక నిమజ్జనం..
- హైదరాబాద్...
- ట్యాంక్ బండ్‌పై కొనసాగుతున్న వినాయక నిమజ్జనం..
- గత ఏడాది కంటే వేగంగా కొనసాగుతున్న నిమజ్జనం ప్రక్రియ.
- నిమజ్జనం కోసం లక్డికాపూల్ వరకు వేచిఉన్న వినాయక వాహనాలు.
The sky is clear and the sun is shining, making for perfect weather for the Lord Ganesh immersion ceremony at Tank Bund. The procession is in full swing today, with a significant number of idols already being immersed. Tomorrow, Saturday, marks the final day of the festivities,… pic.twitter.com/aztkU8XiPZ
— Stephen hawking (@hawking2023) September 5, 2025
కొనసాగుతున్న పనులు..
- కాసేపట్లో ప్రారంభం కానున్న శోభాయాత్ర
- నిన్న రాత్రి నుంచి కొనసాగుతున్న నిమజ్జనం ఏర్పాట్లు..
- కొనసాగుతున్న వెల్డింగ్ పనులు..
- ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో విశ్వశాంతి మహా శక్తి గణపతి గా దర్శనం ఇచ్చిన ఖైరతాబాద్ బడా గణేష్.
- అర్ధరాత్రి నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు..
- ఉదయం ఏడు గంటల తర్వాత శోభాయాత్ర స్టార్ట్ చేసేలా పోలీసుల ఏర్పాట్లు..
- భారీ పోలీస్ బందోబస్తు..
- గణేష్ ముందు రోప్ పార్టీతో భద్రత..
- విశ్వ శాంతి మహా శక్తి గణపతికి రెండు వైపులా దేవతా మూర్తుల విగ్రహాలు..
- కుడివైపు పూరీ జగన్నాథ్ స్వామి, లలితా త్రిపుర సుందరి
- ఎడమ వైపు లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జలమ్మ దేవత విగ్రహాలు..