14 కిలోల గంజాయి పట్టివేత | Cannabis Capture | Sakshi
Sakshi News home page

14 కిలోల గంజాయి పట్టివేత

Aug 4 2017 4:12 AM | Updated on Sep 17 2017 5:07 PM

14 కిలోల గంజాయి పట్టివేత

14 కిలోల గంజాయి పట్టివేత

భువనేశ్వర్‌ నుంచి ముంబై వెళ్లే కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం జీఆర్‌పీ పోలీసులు 14 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు.

కాజీపేట రూరల్‌: భువనేశ్వర్‌ నుంచి ముంబై వెళ్లే కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం జీఆర్‌పీ పోలీసులు 14 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. తమిళనాడులోని తిరుచునాపల్లికి చెందిన 50 ఏళ్ల రహమాన్‌ విశాఖపట్నంలో ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. రహమాన్‌ సుమారు రూ.లక్ష విలువ గల 14 కిలోల ఎండు గంజాయిని బ్యాగులో పెట్టుకుని రిజర్వేషన్‌ బోగి స్లీపర్‌ క్లాస్‌ ఎస్‌–4లో ముంబైలోని దాదర్‌లో అమ్మేందుకు వెళ్తున్నాడు. ప్రత్యేక జీఆర్‌పీ బృందం తనిఖీ చేయగా, రహమాన్‌ వద్ద ప్యాకింగ్‌ చేసిన గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకొని రహమాన్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు రైల్వే డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement