విదేశాలకు నిధులు పంపిన సీఏపై కేసు నమోదు | Case registered against Chartered Accountant for transferring funds abroad | Sakshi
Sakshi News home page

విదేశాలకు నిధులు పంపిన సీఏపై కేసు నమోదు

Aug 23 2026 4:57 AM | Updated on Aug 23 2026 4:57 AM

Case registered against Chartered Accountant for transferring funds abroad

రూ.186 కోట్లు దారి మళ్లించినట్లు ఐటీ అధికారుల ఫిర్యాదు  

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): షెల్‌ కంపెనీల ద్వారా విదేశాలకు రూ.186 కోట్లు పంపించిన చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ దామా చిన్న వెంకట సుబ్రహ్మణ్యంపై ఆదాయపు పన్నుల శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఇచి్చన ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. 

పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు.. గుంటూరు పట్టణం అరండల్‌పేటకు చెందిన చార్టర్డ్‌ అకౌంటెంట్‌ దామా చిన్న వెంకట సుబ్రహ్మణ్యం చట్ట ప్రకారం తగిన ధ్రువీకరణ చేయకుండా ధ్రువపత్రా­లు జారీ చేయడం ద్వారా విదేశాలకు మోసపూరితంగా నిధుల బదిలీ (ఔట్‌ వార్డ్‌ ఫారిన్‌ రిమిటెన్సెస్‌) జరగడానికి సహకరించినట్లు సమాచారం రావ­డంతో ఆదాయపు పన్ను శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుభాష్‌ తమ సిబ్బందితో ఈ నెల 17న చార్టర్డ్‌ అకౌంటెంట్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు.

 ఈ తనిఖీల్లో దేశం వెలుపలికి నిధులను పంపించేందుకు, రిమిటర్‌ సంస్థలకు, షెల్‌/బోగస్‌ కంపెనీల పేరుతో సరైన ధ్రువీకరణ లేకుండానే ధ్రువపత్రాలు జారీ చేసినట్లు గుర్తించారు. దేశ, విదేశీ మారక నిల్వల నిర్వహణకు బాధ్యత వహించే ఆర్‌బీఐ, విదేశాలకు నిధులను పంపే సందర్భంలో ఆథరైజ్డ్‌ డీలర్స్‌ ద్వారా పాటించాల్సిన మార్గదర్శకాలను, ఆర్‌బీఐ నిబంధనలు పాటించకుండా ధ్రువపత్రాలు జారీ చేశారని, ఎలాంటి ఆదాయపు పన్ను రిటరŠున్స  దాఖలు చేయడం లేదని గుర్తించి ఈ మేరకు చిన్న వెంకట సుబ్రహ్మణ్యంపై ఆదాయపు పన్నుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుభాష్‌ అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement