చంద్రబాబు అనకాపల్లి సభలో పారిశుద్ధ్య కార్మికుడు మృతి! | Sanitation Worker Dies During Chandrababus Anakapalle Public Meeting | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అనకాపల్లి సభలో పారిశుద్ధ్య కార్మికుడు మృతి!

Aug 22 2026 9:50 PM | Updated on Aug 22 2026 10:00 PM

Sanitation Worker Dies During Chandrababus Anakapalle Public Meeting

అనకాపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు అనకాపల్లి సభలో పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు పర్యటన ముగిసే వరకూ  వీరబాబు అనే పారిశుద్ధ్య కార్మికుడి మరణాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ విషయాన్ని సీఐటీయూ బహిర్గతం చేసింది. 

పారిశుద్ధ్య కార్మికుడు వీరబాబు డెడ్‌బాడీని కె కోటపాడు ఆస్పత్రికి   తరలించారని, ఆగమేఘాల మీద డెడ్‌బాడీకి పోస్టుమార్టం నిర్వహించి ఇంటికి తరలించాలని యత్నం చేస్తున్నారని అనకాపల్లి జిల్లా సీఐటీయూ అధ్యక్షులు వివి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

చంద్రబాబు పర్యటన సందర్బంగా గత రెండు రోజుల నుంచి పారిశుద్ధ్య కార్మికులను తరలించి అక్కడ పనులు చేస్తుండగా వీరబాబు అనే కార్మికుడు మృతి చెందాడన్నారాయన. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారన్నారు. వీరబాబు కుటుంబానికి న్యాయం చేయాలని, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రూ. 50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని సీఐటీయూ తరఫున డిమాండ్‌ చేస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. 

‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు గుర్తు పెట్టుకోండి’

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement