హైకోర్టు ఆగ్రహంతో దిగొచ్చిన రాజశేఖర్‌బాబు | Rajasekhar Babu Relents After Andhra Pradesh High Court Rebuke | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఆగ్రహంతో దిగొచ్చిన రాజశేఖర్‌బాబు

Oct 7 2026 5:57 AM | Updated on Oct 7 2026 5:57 AM

Rajasekhar Babu Relents After Andhra Pradesh High Court Rebuke

రౌడీషిట్ల ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసిన సీపీ

టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని ఆరోపిస్తూ వారిపై అక్రమంగా రౌడీషిట్లు తెరవమంటూ ప్రొసీడింగ్స్‌ ఇచ్చిన విజయవాడ సీపీ

దీనిపై హైకోర్టును ఆశ్రయించిన పలువురు 

ఈ ప్రొసీడింగ్స్‌ ఎలా చెల్లుతాయని నిలదీసిన హైకోర్టు  

దీంతో ఆ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసి, హైకోర్టుకు నివేదించిన కమిషనర్‌  

వ్యాజ్యాలను మూసేసిన ఉన్నత న్యాయస్థానం  

సాక్షి, అమరావతి: అధికార పార్టీకి కొమ్ముకాస్తూ చట్టాన్ని తుంగలోకి తొక్కి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) రాజశేఖర్‌బాబు హైకోర్టు దెబ్బకు దిగొ­చ్చా­రు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడిచేశారంటూ అభియోగాలు మోపుతూ వారిపై అక్ర­మంగా రౌడీషిట్లు తెరవాలని విజయవాడ కమిషనరేట్‌ ప­రిధిలోని పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలను ఆదేశి­స్తూ గత నెల 22న జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను ఆయ­నే రద్దుచేశారు.

ఈ ప్రొసీడింగ్స్‌ ఎలా చెల్లుబాటవుతాయని, వాటిని ఎలా సమర్ధించుకుంటారని హై­కో­ర్టు నిలదీయడంతో.. సమాధానం చెప్పే పరిస్థితి లేక సీపీ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఆ ప్రొసీడింగ్స్‌ను రద్దుచేసి, ఆ విషయా­న్ని మెమో రూపంలో మంగళవారం హైకోర్టుకు ని­వేదించారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు.. కమిషనర్‌ ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన వ్యా­జ్యాలను మూసేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జ­స్టిస్‌ కుంచెం మహేశ్వరరావు ఉత్తర్వులు జారీచేశారు.  

ఎలా పడితే అలా రౌడీషీట్లు తెరవడానికి వీల్లేదు  
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారంటూ అక్రమంగా వారిపై రౌడీషీట్లు తెరవాలని తన పరిధిలోని ఎస్‌హెచ్‌వోలను, ఆ వ్యవహారాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఏసీపీలను ఆదేశిస్తూ సీపీ రాజశేఖర్‌బాబు గత నెల 22న ప్రొసీడింగ్స్‌ జారీచేశారు. ఈ ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ విజయవాడకు చెందిన బచ్చు మురళీకృష్ణ, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై గత వారం విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ మహేశ్వరరావు.. అసలు సీపీ జారీచేసిన ఉత్తర్వులు ఎలా చెల్లుబాటవుతాయి? వాటిని ఎలా సమర్ధించుకుంటారు? అని ప్రశ్నించారు.

పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు వచ్చాయి. పిటిషనర్ల న్యాయవాది వేలూరు మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. రౌడీషిట్లు ఎలా పడితే అలా తెరిచేందుకు చట్ట నిబంధనలు అంగీకరించవని చెప్పారు. రౌడీషిట్లు ఎప్పుడు తెరవాలి, ఎలా తెరవాలి.. అన్న విషయాలను పోలీస్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్‌ స్పష్టంగా చెబుతున్నాయని తెలిపారు.

అయితే వీటిని పట్టించుకోకుండా టీడీపీ కార్యాలయంపై దాడిచేశారని ఆరోపిస్తూ పిటిషనర్లందరిపై రౌడీషిట్లు తెరవాలంటూ కమిషనర్‌ ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. పోలీసుల తరఫున ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ) అజయ్‌ వాదనలు వినిపిస్తూ.. కమిషనర్‌ ప్రొసీడింగ్స్‌ను సమర్ధించే ప్రయత్నం చేశారు. ఆ ప్రొసీడింగ్స్‌ జారీకి కిందిస్థాయి అధికారులదే బాధ్యత అన్నట్లు చెప్పారు. చివరకు రౌడీషిట్లు తెరవాలంటూ జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను కమిషనర్‌ రద్దుచేశారని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఆ మేరకు మెమో దాఖలు చేశారు. ఈ మెమోను పరిశీలించిన న్యాయమూర్తి.. ఇక ఈ వ్యాజ్యాల్లో విచారించేందుకు ఏమీ లేదంటూ వాటిని మూసివేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement