సమ్మెలోకి వైద్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు | Health Department contract employees go on strike | Sakshi
Sakshi News home page

సమ్మెలోకి వైద్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు

Oct 7 2026 5:26 AM | Updated on Oct 7 2026 5:26 AM

Health Department contract employees go on strike

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలుపుతున్న మెడికల్‌ సిబ్బంది

మంగళవారం విధుల బహిష్కరణ

రాష్ట్ర వ్యాప్తంగా జీజీహెచ్‌లు, ఇతర ఆస్పత్రుల్లో ఆందోళనలు

నేటి నుంచి అత్యవసర సేవల బహిష్కరణ

సాక్షి, అమరావతి: డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ వైద్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సమ్మె ప్రారంభించారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరించారు. అత్యవసర సేవలు మి­నహా మిగిలిన వైద్య సేవలన్నింటినీ స్టాఫ్‌ నర్సులు, ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్‌ టెక్నీషియన్‌లు, ఇతర సహాయ సిబ్బంది బహిష్కరించారు. 28 జిల్లాల్లో జీజీహెచ్‌.. ఇతర ఆస్పత్రుల్లో ఆందోళనలు చేపట్టారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ఉన్నతాధికారులు పలుమార్లు చర్చలు జరిపారు. డిమాండ్‌లు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఏపీ వైద్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగ సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) సమ్మెకు పిలుపునిచ్చింది. 

ఈ సమ్మెలో రాష్ట్రవ్యాప్తంగా 14 వేల మందికిపైగా ఉద్యోగులు భాగస్వామ్యమయ్యారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు, సర్వీస్‌ రెగ్యులరైజ్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తమ సర్వీస్‌ రెగ్యులర్‌ చేసే వరకూ 100 శాతం గ్రాస్‌ శాలరీ ఇవ్వాలని కోరారు. వీరి సమ్మెతో వైద్య సేవలు స్తంభించిపోయి రోగులు అవస్థలు పడ్డారు. సెకండరీ హెల్త్, డీఎంఈ పరిధిలోని ఆస్పత్రులపై ఉద్యోగుల సమ్మె తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరించాలని నిర్ణయించారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో సమ్మెను తీవ్రతరం చేస్తామని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు, కన్వీనర్‌ అజయ్‌ ప్రకటించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement