సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) మరింత ముమ్మరం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్రపునేఠ ఎన్నికల నిర్వహణకు సంబంధించి క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్న ఏర్పాట్లను సమీక్షించేందుకు గురువారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ నగర పోలీసు కమిషనర్లతో పాటు ఆయా జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, నగర, పట్టణ మున్సిపల్ కమిషనర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
బుధవారమే ఈ సమావేశం నిర్వహణకు ఏర్పాటు చేయగా, రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కారణంగా సమావేశం మరుసటి రోజుకు వాయిదా పడింది.


