ప్రతి నెలా మామూళ్లు ఇవ్వాల్సిందే | Ananthapur MLA Daggupati Prasad Caught in Another Controversy | Sakshi
Sakshi News home page

ప్రతి నెలా మామూళ్లు ఇవ్వాల్సిందే

Aug 23 2026 4:38 AM | Updated on Aug 23 2026 4:38 AM

Ananthapur MLA Daggupati Prasad Caught in Another Controversy

సబ్‌ రిజిస్ట్రార్‌కు అనంతపురం అర్బన్‌ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ బెదిరింపులు

 నెలకు రూ.1.50 లక్షలు ఇవ్వాలంటూ హెచ్చరికలు

సబ్‌ రిజిస్ట్రార్‌ రమణారావు ఆడియో లీక్‌.. వైరల్‌గా మారిన వైనం

ప్రతి నెలా డబ్బులు తీసుకో.. వర్కులు చేయొద్దు 

మరో ఆడియోలో.. మున్సిపల్‌ కాంట్రాక్టర్‌తో ఎమ్మెల్యే సంభాషణ

అధికార పార్టీ ఎమ్మెల్యేపై వరుస వివాదాలు.. ఆడియోలు వైరల్‌ 

అధికారుల నుంచి కాంట్రాక్టర్ల వరకు ఒత్తిళ్ల ఆరోపణలు

అనంతపురం: అనంతపురం అర్బన్‌ టీడీపీ ఎమ్మె­ల్యే దగ్గుపాటి ప్రసాద్‌ మరో వివాదంలో చిక్కుకు­న్నారు. ఆయన నెలవారీ మామూళ్ల వసూళ్లకు ఒత్తిడి తెచ్చారంటూ ఆడియో సంభాషణలు సోష­ల్‌ మీడియాలో వైరల్‌ కావడం కలకలం రేపింది. అనంతపురం అర్బన్‌లో సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో నెలకు రూ.1.50 లక్షలు ఇవ్వాలని, లేదంటే సెలవుపై వెళ్లిపోవాలని తనను ఎమ్మెల్యే బెదిరించినట్లు రమణారావు పేర్కొన్నారు.

ఈ మేరకు ఆడియో ఒకటి సోషల్‌ మీడియాలో ప్రచా­రంలోకి వచ్చింది. ప్రభుత్వ అధికారి నుంచే నేరు­గా ఈ అభియోగాలు రావడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రతను సంతరించుకుంది. ఇదే సమ­యంలో మున్సిపల్‌ కాంట్రాక్టర్‌ శ్రీనివాస చౌదరి­తో ఎమ్మెల్యే మాట్లాడినట్లుగా ఉన్న మరో ఆడియో కూడా సోషల్‌ మీడియాలో తిరుగుతోంది. ‘‘నెలనె­లా డబ్బులు తీసుకుని పో.. వర్కులు చేయొద్దు’’ అని కాంట్రాక్టర్‌తో ఎమ్మెల్యే అన్నట్లుగా ఉన్న వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

నెలనెలా డబ్బు తీసుకో.. వర్కులు వద్దు
శ్రీనివాస చౌదరి అనే కాంట్రాక్టర్‌తో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ జరిపిన సంభాషణకు సంబంధించి మరో ఆడియో బైటకొచ్చింది... తమ మధ్య బంధుత్వం ఉందని ప్రస్తావిస్తూ, ‘‘నీకేం కావాలో చెప్పు.. నేను చేసి పెడతా.. ప్రతి నెలా డబ్బులు తీసుకుని పో.. వర్కులు చేయొద్దు’’ అని ఎమ్మెల్యే చెప్పినట్లుగా ఆడియోలో ఉంది. కాంట్రాక్టర్‌ తనకు పనులు కావాలని అడిగినట్లు చెప్పగా.. అందుకు బదులుగా నెలవారీగా డబ్బులు ఇస్తానని ఎమ్మెల్యే చెప్పినట్లుగా సంభాషణ సాగింది. 

ఇదే ఆడియో సంభాషణలో అనంతపురం టీడీపీ అంతర్గత రాజకీయాలు, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి (వీపీసీ)తో శ్రీనివాస చౌదరి సంబంధాలు, పార్టీ వర్గాల మధ్య విభేదాల ప్రస్తావన కూడా ఉంది. దీంతో ఈ ఆడియో కేవలం కాంట్రాక్టర్‌ వ్యవహారానికే పరిమితం కాకుండా స్థానిక టీడీపీ రాజకీయాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది.

గతంలోనూ దగ్గుపాటిపై వివాదాలెన్నో..
అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసా­ద్‌­ను ఇటీవలి కాలంలోనే ఎన్నో వివా­దాలు చుట్టుముట్టాయి. ఎగ్జిబిషన్‌ నిర్వాహ­కుడు ఫకృద్ధీన్‌పై దగ్గుపాటి ప్రసాద్‌ అనుచరు­లు  దాడి చేశారు. రూ.10 లక్షలు ఇవ్వకపోతే ఎగ్జిబిషన్‌ నిర్వహించనీయబోమని ఈ ఏడాది జనవరిలో బెదిరించారు. నిర్వాహకుడు డబ్బు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో మద్యం సేవించి ఎగ్జిబిషన్‌లో హంగామా స్పష్టించా­రు. ఫకృద్దీన్‌ నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 

⇒ వార్‌–2 సినిమా విడుదల సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల ఆడియో టేప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యి వివాదానికి దారి తీసింది. ఎన్టీఆర్‌ అభిమానులు ఎమ్మెల్యే కార్యాలయం ముందు నిరసనలు తెలిపి, ఫ్లెక్సీలను చించేశారు. 
⇒ ఈ ఏడాది జనవరిలో ఆస్తి తగాదా విష­యంలో ఒక మహిళా డాక్టర్‌ భర్తను ఎమ్మె­ల్యే దుర్భాషలాడారు. దీనికి సంబంధించి ఫోన్‌ సంభాషణ ఆడియో వైరల్‌ అయింది. 

⇒ ఎమ్మెల్యే అనుచరులు అనంతపురం అర్బన్‌ పరిధిలో పలు భూ కబ్జాలకు పాల్పడు­తు­న్నా­రంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తు­న్నాయి. అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి నేరుగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ రెండు సంవత్సరాల్లో ఎమ్మెల్యే రూ.200 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు ఆధారాలతో సహా టీడీపీ అధిష్టానానికి అందజేశారు.
⇒ అనంతపురం నగరంలో ఓ లిక్కర్‌ షాపులో వా­టాలు ఇవ్వలేదనే ఉద్దేశంతో దౌర్జన్యంగా లిక్కర్‌ షాపునకు నిప్పు పెట్టారు. ఈ వివాదంలో ఎ­మ్మె­­­­ల్యే అనుచరులను రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement