అత్యాచారయత్నం చేసిన వ్యక్తిపై కేసు | Rape case registered on person | Sakshi
Sakshi News home page

అత్యాచారయత్నం చేసిన వ్యక్తిపై కేసు

Sep 11 2017 12:16 PM | Updated on Jul 28 2018 8:53 PM

జడ్చర్లలో ఓ బాలిక(14)పై అత్యాచారం చేయబోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గంగాధర్‌ తెలిపారు.

జడ్చర్ల : జడ్చర్లలో ఓ బాలిక(14)పై అత్యాచారం చేయబోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గంగాధర్‌ తెలిపారు. స్థానిక ఇందిరానగర్‌ కాలనీలో తల్లితోపాటు ఉంటున్న ఓ బాలికపై ఒంటరిగా ఉన్న సమయంలో జడ్చర్లకు చెందిన రాజేశ్‌ అనే వ్యక్తి అత్యాచారం చేయబోయాడు. అయితే వెంటనే బాలిక గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో ఆదివారం బాలిక తమకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు రాజేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement