ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం.. పీఏపై కేసు నమోదు | Case Registered Against MLA Lasya Nanditha PA Over Car Accident, Details Inside - Sakshi
Sakshi News home page

MLA Lasya Nanditha Death: ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం.. పీఏపై కేసు నమోదు

Feb 23 2024 6:46 PM | Updated on Feb 23 2024 7:17 PM

Case Registered Against Mla Lasya Nanditha Car Accident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై కేసు నమోదైంది. సోదరి నివేదిత ఫిర్యాదుతో పటాప్‌చెరు పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 304ఏ కింద లాస్య పీఏ ఆకాశ్‌పై కేసు నమోదు చేశారు. ఉదయం 5.15 గంటలకు ఆకాశ్‌ ఫోన్‌ చేశారని.. ఇద్దరికే దెబ్బలు తగిలాయని లోకేషన్‌ షేర్‌ చేశాడని లాస్య సోదరి నివేదిత తెలిపింది. మేం వెళ్లి చూసేసరికి కారు నుజ్జునుజ్జుగా ఉందని ఆమె చెప్పింది.

అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని సంగారెడ్డి ఏఎస్పీ సంజీవ్‌రావు వెల్లడించారు.ముందున్న వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత.. అదుపు తప్పి ఓఆర్‌ఆర్‌ పక్కన రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు లాస్య నందిత బతికే ఉంది. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. ప్రమాదంలో లాస్య పీఏ ఆకాష్‌ కాళ్లు విరిగిపోయాయని ఏఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి: లాస్య నందితను వెంటాడిన మృత్యువు

Advertisement
 
Advertisement
Advertisement